ప్రభాస్ ఫ్యాన్ వల్గర్ కామెంట్ కు ‘UV’ ప్రొడ్యూసర్ కౌంటర్ ట్వీట్..!


యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ”రాధే శ్యామ్” ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై డార్లింగ్ స్నేహితులు వంశీ – ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారు. అయితే సినిమా అప్డేట్స్ విషయంలో చిత్ర నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ మొదటి నుంచీ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా.. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ – గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇటీవల కృష్ణాష్టమికి కూడా ఓ పోస్టర్ వదిలారు. ‘సాహో’ సినిమా తర్వాత 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ యూవీ బ్యానర్ మీద గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో అసహనం వ్యక్తం చేస్తూ నిర్మాతలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో యూవీ క్రియేషన్స్ మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో అనేకసార్లు ట్రెండ్ చేశారు. తాజాగా ఉప్పలపాటి ప్రమోద్ పై ఓ నెటిజన్ వల్గర్ ట్వీట్ చేయగా.. దానికి అదే విధంగా యూవీ ప్రొడ్యూసర్ కౌంటర్ ఇచ్చారు.

ట్విట్టర్ లో కాసేపు చిట్ చాట్ నిర్వహించిన ప్రమోద్.. ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ కు చెందిన పెట్ డాగ్ ‘బ్లూ’ ఫోటోని షేర్ చేశారు. దీనికి ఓ ఫ్యాన్ స్పందిస్తూ.. ‘అప్డేట్స్ ఇవ్వకుండా ఉండే బదులు దానిది పె*కో ప్రమోద్ అన్నా’ అని అసభ్యకరమైన కామెంట్ పెట్టాడు. అయితే దీనిపై ప్రమోద్ కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యారు. వల్గర్ మీమ్ ద్వారా ఘాటు రిప్లై ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 10న ‘రాధే శ్యామ్’ ఫస్ట్ సింగిల్ వస్తుందా అని అడిగిన ఓ డార్లింగ్ ఫ్యాన్ కు అఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఏదీ నమ్మొద్దని నిర్మాత తెలిపారు.

కాగా ‘మిర్చి’ సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన యూవీ క్రియేషన్స్.. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు మరోవైపు మీడియం బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇటీవల ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చిన్న సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. ఇలా యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా.. మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు.


Recent Random Post: