రష్మీని పక్కన పెట్టి ఆ డాన్సర్ ని రెకమండ్ చేస్తున్న సుధీర్

జబర్దస్త్‌ అనగానే సుధీర్ మరియు రష్మి జోడీ గుర్తుకు వస్తుంది. వీరిద్దరి మద్య రొమాన్స్‌ కెమిస్ట్రీ ఓ రేంజ్‌ లో వర్కౌట్‌ అవ్వడంతో గత రెండు మూడు సీజన్‌ ల నుండి ఢీ కి కూడా వీరిని ఉపయోగిస్తున్నారు. ఒక వైపు రష్మి తో రొమాన్స్‌ చేస్తూనే మరో వైపు కో యాంకర్స్‌ లేదా కంటెస్టెంట్స్‌ తో సుధీర్‌ రొమాంటిక్‌ యాంగిల్ ను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఢీ తో మంచి గుర్తింపు దక్కించుకున్న అక్సాఖాన్‌ కు సుధీర్‌ అంటే ఎక్కడో చిన్న పాజిటివ్‌ బజ్‌ ఉన్నట్లుంది. అందుకే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సుధీర్‌ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అంది.

కట్‌ చేస్తే సుధీర్‌ ప్రస్తుతం చేస్తున్న ఒక సినిమా కోసం అక్సా ఖాన్‌ ను తీసుకు వచ్చాడట. ఆమెను కొరియోగ్రాఫర్‌ గా పరిచయం చేసేందుకు సిద్దం అయ్యాడట. కొరియోగ్రాఫర్‌ గానా లేదా హీరోయిన్‌ గానా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కాని వీరిద్దరి జోడీ అయితే మరింత ముందుకు వెళ్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అక్సాఖాన్‌ మరియు సుడిగాలి సుధీర్‌ల కాంబోకు మంచి మార్కులు పడితే ఈ జోడీని ముందు ముందు మరిన్ని కార్యక్రమాల్లో చూస్తాం కావచ్చు. మరి వీరి జోడీ గురించి రష్మి ఎలా ఫీల్‌ అవుతుందో వేచి చూడాలి.


Recent Random Post: