జక్కన్నని అందుకే ప్రభాస్ దించుతున్నారా?

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` రిలీజ్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. అనూహ్యాంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముందే తగ్గుముఖం పట్టడంతో మార్చి 11న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. దీంతో యూనిట్ సినిమాలో దొర్లిన తప్పిదాల్ని సరిద్దిద్దుకుంటున్నట్లు సమాచారం.

వాస్తవానికి సినిమాకి బజ్ తీసుకురావడంలో టీమ్ వెనుకబడే ఉంది. టీజర్…ట్రైలర్ తోనే సినిమాపై కాస్త నెగివిటీ వ్యక్తం అయింది. సాగదీత ఎక్కువుందనే ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. ఎగ్జైట్ మెంట్ తీసుకురావాల్సిన ట్రైలరే నీరసించినట్లు ఉందని ఒకింత అసహనం వ్యక్తం అయింది. థియేటర్లో రెండున్నర గంటలు కూర్చొని చూడగలమా? సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంది అన్న సందేహం వ్యక్తం అయింది.

దీంతో వెంటనే ప్రభాస్ రంగంలోకి దిగి ఎడిటింగ్ విషయంలో కల్పించుకున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. సినిమాని వీలైనంత ట్రిమ్ చేయాలని మేకర్స్ ని కోరినట్లు తెలిసింది. కొంత మంది టాలీవుడ్ ప్రముఖులకి స్పెషల్ షో వేసి ఫీడ్ బ్యాక్ తీసుకోగా ప్రభాస్ రంగంలోకి దిగినట్లు తేలింది. అయినా ఎక్కడో సందేహం యూనిట్ ని సైతం వెంటాడిందే ఎమో! తాజాగా ప్రభాస్ సినిమా ఫైనల్ కట్ విషయంలో దిగ్ధదర్శకుడు రాజమౌళి సహకారం కోరినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కోరిక మేరకు జక్కన్న రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ఆధ్వర్యంలో అవసరం మేర ఎడిటింగ్ చేస్తున్నట్లు గుస గుస వినిపిస్తోంది. సినిమాలో అనవసరైన సన్నివేశాలన్నింటికి కత్తెర వేస్తున్నారుట. జక్కన్న మార్క్ ఎడిటింగ్ తో సినిమా ని ట్రిమ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సినిమాని వీలైనంత గ్రిప్పింగ్ గా చూపించాలని ఇలా జక్కన్నని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

`బాహుబలి` లాంటి లార్జ్ స్ర్కిప్ట్ నే జక్కన్న ఎంతో అందంగా మలిచారు. దానికి అద్భుతమైన దృశ్యరూపం..స్ర్కీన్ ప్లే పరంగా ప్రేక్షకుడ్ని ఎక్కడా గందరగోళానికి గురికాకుండా చూపించారంటే దానికి కారణం ఎడిటింగ్. ఆ విభాగం సినిమాని ఓ స్థాయిలో నిలబెట్టింది. ఇక `రాధేశ్యామ్` లాంటి లవ్ స్టోరీలపై జక్కన్న తన మార్క్ ఎడిటింగ్ తో ఎగ్జైట్ మెంట్ తీసుకురాకుండా ఉంటారా? జక్కన్న ఎంట్రీ తో `రాధేశ్యామ్` టీమ్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్లు తెలుస్తోంది.

డార్లింగ్ ఇంత కేరింగ్ తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. `బాహుబలి` తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ అటుపై పెద్దగా అనుభవం లేని యంగ్ మేకర్ సుజీత్ తో `సాహో` లాంటి భారీ చిత్రాన్ని చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. యంగ్ మేకర్ తప్పిదాలు అందులో స్పష్టంగా కనిపించాయి.

ఇక `రాధేశ్యామ్` కి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ కి కూడా మేకింగ్ విషయంలో అంత ఎక్స్ పర్ట్ కాదు. దర్శకుడిగా `జిల్` సినిమా ఒక్కటే చేసాడు. రైటర్ గా పలు సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది గానీ…మేకర్ గా పూర్తి స్థాయిలో ఇంకా నిరూపించుకోలేదు. అలాంటి తెలిసి తెలియని తప్పిదాల్ని కవర్ చేసేందుకే సీనియర్ అయిన రాజమౌళి సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Recent Random Post: