మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ ఏంటీ?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైనప్ ని జాగ్రత్తగా పరిశీలించిన ప్రతీ ఒక్కరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న .. మెగాస్టార్ టార్గెట్ ఏంటీ?. వున్నట్టుండి ఆయన సినిమాల పరంగా స్పీడెందుకు పెంచారు?..ఈ వయసులో ఈ స్పీడేంటీ? .. ఒక సినిమా సెట్స్లో వుంటే మరో సినిమాని ఈ మధ్య కాలంలో అంగీకరించని మెగాస్టార్ ఇప్పుడే ఎందుకు స్పీడు పెంచేశారు? .. ఎందుకు వన్ బై వన్ అంటూ వరుస చిత్రాలని లైన్లో పెట్టేస్తూ షాకుల మీద షాకులిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

కెరీర్ ప్రారంభంలో అంటే 1978 నుంచి 1990 వరకు ఏడాదికి ఐదారు చిత్రాల్లో నటిస్తూ వచ్చిన మెగాస్టార్ మళ్లీ ఇన్నేళ్లకు అదే పంథాలో ఒకే ఏడాది నాలుగైదు చిత్రాల్లో నటిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తోంది. `సైరా నరసింహారెడ్డి` తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ఈ ఏడాది ఏకంగా ఐదు చిత్రాలని ఓకే చేయడం.. అందులో మూడు నుంచి నాలుగు చిత్రాలు అండర్ ప్రొడక్షన్లో వుండటం.. ఇందులో కొరటాల శివతో చేస్తున్న `ఆచార్య` ఫిబ్రవరిలో రిలీజ్కి రెడీ అవుతుండటం కొత్త అనుమానాలకు తెర తీస్తోంది.

తాజాగా `భీష్మ`తో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమాకు ఓకే చెప్పేశారు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారని తెలిసింది. ఇన్నేళ్ల తరువాత చిరు ఉన్నట్టుండి స్పీడు పెంచడానికి కారణం ఆయన వీలైనంత త్వరగా 175 చిత్రాల మార్కుని దాటాలని టార్గెట్ ఏదైనా పెట్టుకున్నారా?… లేక తన చుట్టూ వున్న వాళ్లకి.. తనని నమ్ముకున్న వాళ్లకి అవకాశాలు ఇచ్చి మరో మూడు.. నాలుగేళ్ల తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఏదైనా వున్నారా? అనే అనుమానాల్ని ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్గా అంగీకరించిన వెంకీ కుడుముల చిత్రంతో 156 చిత్రాలయ్యాయి. రానున్న రోజుల్లో మరో 19 కంప్లీట్ చేస్తే చిరు 175 చిత్రాల మైలు రాయిని పూర్తి చేస్తారు.


Recent Random Post: