విజయ్​-దిల్ రాజు.. డీల్ అంటే ఇలా ఉండాలి!

టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండను ఒకప్పుడు హీరోగా సెలెక్ట్ చేయని నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ఆయనతోనే యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ మూవీ తీశారు. అంతే కాదు మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీగా రానుంది. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అవును మీరు చదివింది నిజమే!

2015లో యువ నటులు సుమంత్ అశ్విన్, విస్వంత్, పార్వతీశం లీడ్ రోల్స్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కేరింత గుర్తుందా? ఆ సినిమాకు విజయ్ దేవరకొండ కూడా ఆడిషన్స్ ఇచ్చారట. కానీ అప్పుడు దిల్ రాజు.. విజయ్ ను సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లోనే సినిమా చేసే స్థాయికి ఎదిగారు విజయ్. కెరీర్ లో ఫస్ట్ టైం విజయ్ కు అడ్వాన్స్ ఇచ్చి మరీ ఫ్యామిలీ స్టార్ సినిమా తీశారు దిల్ రాజు.

కాగా, ఈ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలకు విజయ్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు దిల్ రాజు. ఈ విషయాన్ని ఇటీవల దిల్ రాజే చెప్పారు. “విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నా. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కాస్త టైమ్ పడుతుంది. అంతా పూర్తయ్యాక ఆ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్తాం. విజయ్ ప్రొడ్సూసర్స్ గురించి ఆలోచించే హీరో. అందుకే మరిన్ని సినిమాలు చేస్తున్నా” అని ఓ ఈవెంట్ లో తెలిపారు.

అయితే రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా.. ఇటీవల విజయ్ కు స్క్రిప్ట్ వినిపించినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ప్రాజెక్టునే దిల్ రాజు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఇవ్వనున్నారు మేకర్స్. విజయ్ తో ఇప్పటికే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేశారు దిల్ రాజు. కానీ ఆ మూవీ కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది.

ఇప్పుడు విజయ్- దిల్ రాజు కాంబోలో తెరకెక్కనున్న మూడో చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ కు సాలిడ్ రెమ్యునరేషన్ అందుకున్న విజయ్.. దిల్ రాజు బ్యానర్ లో చేయబోయే నెక్స్ట్ సినిమాలకు కూడా పెద్ద మొత్తంలో అందుకోనున్నారని టాక్. అయితే మైత్రీ సంస్థ నుంచి దిల్ రాజు చేతికొచ్చిన మరో విజయ్ సినిమా పెండింగ్ లో ఉంది. ఇటీవల ఈ సినిమా కచ్చితంగా చేస్తానని చెప్పారు దిల్ రాజు. మరి ఆ సినిమా ఈ రెండింటిలో ఉందో లేదో క్లారిటీ లేదు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక దానిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.


Recent Random Post: