అతడు ఇచ్చిన బహుమానం తో భయమేసింది!

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో వివి వినాయక్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నుష్రత్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను మే 12వ తారీకు భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హిందీ ఛత్రపతి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల హీరో మరియు హీరోయిన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు నుష్రత్ లు మీడియా ముందుకు వచ్చారు. ఆ సందర్భంగా ఇద్దరూ కూడా తమ జీవితంలో అభిమానుల వల్ల ఎదుర్కొన్న భయంకర పరిస్థితులను షేర్ చేసుకున్నారు.

నుష్రత్ మాట్లాడుతూ.. కొన్నాళ్ల క్రితం ఒక అభిమాని మా ఇంటి ముందు చాలా బహుమానాలు పెట్టి వెళ్లాడు. అందులో రెండు ముక్కలుగా ఉన్న హార్ట్ సింబల్ ఉంది. ఒక హార్ట్ పీస్ పై నా పేరు.. మరో పీస్ పై అతడి పేరు ఉంది. అతడు అలా ఎందుకు రాశాడు.. అతడు ఎవరు నాకు తెలియదు. అయితే అతడికి తన అడ్రస్ ఎలా తెలిసింది.. ముందు ముందు అతడి వల్ల ఏమైనా సమస్య ఉంటుందా అని చాలా భయపడ్డాను అంది.

బెల్లంకొండ మాట్లాడుతూ.. ఒక సారి నేను కారు ఎక్కతున్న సమయంలో నా కంటే ముందు ఒక వ్యక్తి నా కారులోకి ఎక్కి కూర్చుని దయచేసి నాతో ఒక సెల్ఫీ దిగండి అంటూ కోరాడు. అతడు అడిగినట్లుగా సెల్ఫీ ఇచ్చి కారు దిగమన్నాను. అతడు కారు దిగే వరకు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇలాంటి వారు కూడా ఉంటారా అని నేను ఆందోళన చెందాను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నాడు.


Recent Random Post: