మళ్లీ పెళ్లి.. మరో ట్విస్ట్ ఇచ్చిన నరేష్ భార్య

సీనియర్ నటుడు నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కి ఇప్పుడు ఊహించని షాక్ వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమాను ఆపేయాలంటూ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు.

రమ్య రఘుపతి ఈ సినిమా విషయంలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని ఆమె ఆరోపించడం గమనార్హం. రేపు మళ్లీ పెళ్లి చిత్రం విడుదల కానుండగా.. రమ్య రఘపతి సినిమా విడుదలను ఆపాలని కోర్టుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా ఈ మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ పవిత్ర లోకేష్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది వీరి నిజ జీవిత కథ గా తెలుస్తోంది. నరేష్ ఆయన భార్య భార్య రమ్య రఘుపతితో జరిగిన వివాదాలను ఆమెలోని నెగిటివ్ కోణాన్ని ప్రేక్షకులను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తనను నెగిటివ్ చూపించారనే కారణంతోనే ఆమె ఈ సినిమా అడ్డుకోవాలని ప్రయత్నించడం గమనార్హం.

మరి ఈ సినిమా రేపు విడుదలౌతుందా లేక సినిమాని కోర్టు నిలిపివేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని మరోవైపు నరేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే. ఒకవేళ వాయిదా పడితే మళ్లీ దీనిని మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో నరేష్ పవిత్రల మధ్య లిప్ లాక్ సీన్లు కూడా ఉండటం గమనార్హం. ఈ విషయం ట్రైలర్ చూసిన వారికి ఇప్పటికే అర్థమైపోయింది. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సాంగ్స్ ట్రైలర్ ఆకట్టుకోగా.. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.


Recent Random Post: