12 నెలలు.. 4 సినిమాలు.. 5 వేల కోట్ల టార్గెట్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్లానింగ్ చూస్తే మిగతా హీరోల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. బాహుబలితో నేషనల్ వైడ్ సూపర్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ప్రభాస్ తన ప్రతి సినిమాతో బిజినెస్ అదరగొట్టేస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అంటే చాలు బిజినెస్ వందల కోట్లలో జరుగుతుంది.

ప్రభాస్ రాబోతున్న సినిమాలతో వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. సలార్ కూడా సెప్టెంబర్ రిలీజ్ అంటున్నారు.

ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కె కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. అంటే ఆరు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటుగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మారుతి ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ అవుతుందట. సో 12 నెలల వ్యవధిలో ప్రభాస్ నాలుగు భారీ సినిమాలు రాబోతున్నాయి.

వీటితో కోట్ల కొద్దీ బిజినెస్ జరుగుతుంది. అయితే ప్రభాస్ సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే 1000 కోట్లు పెద్ద లెక్కేమి కాదు. ప్రభాస్ రేంజ్ ఇది అని చూపించిన కలెక్షన్స్ దీనికి సాక్ష్యం.

రిలీజ్ కాబోయే నాలుగు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా 1000 కోట్ల మార్క్ దాటితో ఈ నాలుగు సినిమాలతో ప్రభాస్ 5000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతాడని చెప్పొచ్చు. 12 నెలలు నాలుగు సినిమాలు ప్రభాస్ టార్గెట్ 5 వేల కోట్ల ని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఓ విధంగా ఇండియాలో ఏ హీరోకి ఇలాంటి ఛాన్స్ లేదని చెప్పొచ్చు. బాలీవుడ్ హీరోలకు ధీటుగా వాళ్లని దాటేసేలా ప్రభాస్ క్రేజ్ ఏర్పడింది.

ప్రభాస్ నుంచి రాబోతున్న నాలుగు సినిమాలు అనుకున్న విధంగా ఉంటే మాత్రం ప్రభాస్ ని ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పొచ్చు. ఈ 4 సినిమాల తర్వాత ప్రభాస్ సలార్ 2 సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయని చెప్పొచ్చు.


Recent Random Post: