సినీ కార్మికులందరికి యశ్‌ రూ.5 వేలు సాయం

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కరోనా లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులు పడుతున్న కష్టంను చూసి చలించి పోయాడు. ఆయన తనవంతు సాయంగా కోటిన్నర రూపాయల ఆర్థిక సాయంకు ముందుకు వచ్చాడు. గుర్తింపు పొందిన సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 3000 వేల మంది సినీ కార్మికులకు యశ్‌ సాయం చేస్తున్నాడు. మొత్తం 3 వేల మందికి కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ లో 5 వేల రూపాయల చొప్పున వేసేందుకు సిద్దం అయ్యాడు.

ఆర్థికంగా యశ్‌ చేస్తున్న సహాయంను అందరు అభినందిస్తున్నారు. తాను చేస్తున్న సాయం చిన్నదే అయినా కూడా తనవంతు సహకారం వారికి అందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో వారికి ఈ మొత్తం చాలా ఉపయోగదాయకంగా ఉంటుందని భావిస్తున్నాను అన్నాడు. కేజీఎఫ్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యశ్‌ అతి త్వరలోనే మరిన్ని సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొత్త ప్రాజెక్ట్‌ లను కమిట్‌ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న యశ్‌ కేజీఎఫ్ 2 జులై లో విడుదల కాబోతుంది.


Recent Random Post: