ఎక్స్ క్లూజివ్: రానా ‘విరాటపర్వం’లో మరో స్టార్‌ లేడీ

యంగ్‌ హీరో రానాతో వేణు ఉడుగుల రూపొందిస్తున్న విరాట పర్వం చిత్రం రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ రానా అనారోగ్య కారణంగా ఆలస్యం అయ్యింది. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే నెలతో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్‌ సాయి పల్లవి నటిస్తుంది. కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మను నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విరాటపర్వం సినిమాలో ట్యాలెంటెడ్‌ నటిగా గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ నివేత పేతురాజ్ ను ఎంపిక చేశారట. ఈమె పాత్ర ఏంటీ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రానాకు ఈమెకు మద్య సీన్స్‌ ఉంటాయట, కాని అవి రొమాంటిక్‌ సీన్స్‌ కావు అంటున్నారు. హీరోయిన్‌ గా నటిస్తూనే ఈ అమ్మడు ఇలా ముఖ్య పాత్రలను గెస్ట్‌ రోల్స్‌ ను చేస్తోంది. నటిగా పేరు దక్కించుకునేందుకు ఈమె తాపత్రయ పడుతూ ఉంది. విరాటపర్వంలో నివేత పేతురాజ్ మరోసారి తన నటన ప్రతిభను కనబర్చే అవకాశం ఉంది.



Recent Random Post: