బ్రేకింగ్: తండ్రి అయిన విరాట్ కోహ్లీ


ఆస్ట్రేలియా సిరీస్ ను వదులుకొని మరీ భార్య అనుష్క శర్మ డెలివరీకి వచ్చిన విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ అందింది. విరాట్ భార్య అనుష్క ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సోమవారం మధ్యాహ్నం తమకు కుమార్తె పుట్టిందని.. పాప అనుష్క ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ తెలిపారు. తమ జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంనందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఈ పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని కోహ్లీ కోరారు.

సిడ్నీలో అద్భుత పోరాట ప్రతిభతో మూడో టెస్టును డ్రా చేసుకున్న రోజునే కోహ్లీ తండ్రి కావడం విశేషం. ఈరోజు భారత మాజీ క్రికెట్ రాహుల్ ద్రావిడ్ పుట్టిన రోజు కావడం గమనార్హం. ఓవైపు ఇండియా పోరాడి గెలిచిన రోజునే కోహ్లీకి కూతురు పుట్టడంతో ఆ సంబరం రెట్టింపు అయ్యింది.


Recent Random Post: