మరో భారీ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి

ప్రస్తుతం విజయ్ సేతుపతి టైమ్ బాగా నడుస్తోంది. నటన పరంగా అత్యంత టాలెంటెడ్ అయిన విజయ్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడాలు లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు. రానున్న రెండేళ్ల వరకూ విజయ్ డైరీ ఖాళి లేదని సమాచారం. అందుకనే బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, తెలుగులో అల్లు అర్జున్ పుష్ప సినిమాలను వదులుకున్నాడు. అయితే ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటనకు టాలీవుడ్ జనాలు ఫిదా అయిన విషయం తెల్సిందే.

విజయ్ మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇక తాజా సమాచారం ప్రకారం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తర్వాతి సినిమాలో కూడా విలన్ గా చేయమని విజయ్ సేతుపతిని సంప్రదించాడట.

లోకేష్ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాను అనౌన్స్ చేసాడు. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ముందుగా లారెన్స్ పోషించనున్న పాత్రను ఇప్పుడు విజయ్ కు ఆఫర్ చేశారట. మరి విజయ్ తన బిజీ షెడ్యూల్ నుండి ఈ సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయగలడా?


Recent Random Post: