విజయ్ దేవరకొండ – సమంత.. ఓ రొమాంటిక్ మూవీ

సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బయోపిక్ `మహానటి`. కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో మహానటిగా జీవించిన ఈ చిత్రం తనకు ఉత్తమ నటిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని అందించింది. అయితే ఈ చిత్రంలో కీర్తిసురేష్ – దుల్కర్ సల్మాన్ తమ పాత్రల్లో ఒదిగిపోయి ఏ స్థాయిలో లవ్ స్టోరీని నడిపించారో అంతకు మించిన స్థాయిలో విజయ్ దేవరకొండ – సమంత ల రొమాన్స్ సాగింది. ఇందులో విజయ్ దేవరకొండ ఫొటోగ్రాఫర్ గానూ సమంత సావిత్ర జీవితంపై రీసెర్చ్ చేసే పాత్రికుయురాలిగానూ కనిపించి ఆకట్టుకుంది.

సావిత్ర జీవిత కథపై పరిశోధన చేసే క్రమంలో విజయ్ దేవరకొండకు సమంతకు మధ్య వచ్చే సన్నివేశాలు లవ్లీగా వుంటాయి. ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ కూడా ఈ సన్నివేశాలకు ప్రాణం పోసింది.

ఇదే రొమాన్స్ ని పూర్తి స్థాయిలో వీరిద్దరి మధ్య ఓ సినిమాలో చూస్తే ఎలా వుంటుంది? .. అభిమానులకు నిజంగా అది ఓ విజువల్ ఫీస్టే కదా? .. ఇలాంటి ప్రయత్నమే ఇప్పుడు జరగబోతోంది. `మహానటి`లో విజయ్ దేవరకొండ – సమంత కెమిస్ట్రీని గమనించడే ఏమోకానీ దర్శకుడు శివ నిర్వాణ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు.

ఇటీవల నేచురల్ స్టార్ నానితో `టక్ జగదీష్` అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని అందించిన శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నారట. గతంలో విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ కలయికలో ఓ ప్రాజెక్ట్ ని అధికారికంగా దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ `లైగర్` ప్రాజెక్ట్ తో బిజీగా వుండటం శివ నిర్వాణ `టక్ జగదీష్` పనుల్లో వుండటంతో ఈ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు శివ నిర్వాణ బిజీగా వున్నారని ఈ మూవీని కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరపైకి తీసుకురాబోతున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా సమంత నటించనుందట. ఇప్పటికే ఆమెకు దర్శకుడు లైన్ వినిపించాడని కథ నచ్చడంతో సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది.

`లైగర్` కోసం లాంగ్ హెయిర్ తో కనిపించిన విజయ్ దేవరకొండ తాజాగా లాంగ్ హెయిర్ ని కట్ చేయించుకుని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఆ లుక్ శివ నిర్వాణ సినిమా కోసమేనని తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుందని దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని చెబుతున్నారు. సమంత ప్రస్తుతం `యశోద` చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ లో రాజ్ ఎన్ డీకే రూపొందించబోతున్న వెబ్ సిరీస్ చేయబోతోంది. విజయ్ దేవరకొండ కూడా `లైగర్` పూర్తి చేసి `జనగణమన` ని పట్టాలెక్కించడానికి రెడీ అయిపోతున్నాడు.


Recent Random Post: