‘గని’ పంచ్ అక్కడ పడలేదు.. రిలీజ్ పై గందరగోళం

వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గని’. నేడు ఈ సినిమా ను విడుదల చేశారు. తెలుగు లో రూపొందిన ఈ సినిమాను కన్నడంలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా మొదటి నుండి ప్రచారం చేశారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో కన్నడంలో సినీ అభిమానులు గనిని ఆధరిస్తారని భావించారు.

తెలుగు భాష లో గని సినిమాను ఎప్పుడు అయితే విడుదల చేస్తారో అదే రోజున అంటే నేడే కన్నడం లో కూడా విడుదల చేయాల్సి ఉంది. కాని కారణం ఏంటో తెలియదు కాని అనూహ్యంగా గని కన్నడ వర్షన్ ను రిలీజ్ చేయలేదు. తెలుగు వర్షన్ నే బెంగళూరుతో పాటు అక్కడక్కడ విడుదల చేయడం జరిగిందట. కన్నడం లో గని సినిమా వస్తుందంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసి ఇప్పుడు విడుదల చేయక పోవడంతో గందరగోళం ఏర్పడింది.

గని పంచ్ లకు తెలుగు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఈ సమయంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పాత్ర గురించి కన్నడ ప్రేక్షకులు వాకబు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు సినిమా కన్నడం లో విడుదల అవ్వలేదు అనే విషయం మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత తర్వాత అయినా ఈ సినిమా అక్కడ విడుదల అవుతుందా అనేది తెలియడం లేదు.

కన్నడంలో హీరోగా సూపర్ సక్సెస్ అయిన ఉపేంద్ర ఈ సినిమా లో నటించడం వల్ల అంచనాలు అక్కడ కూడా భారీ నెలకొన్నాయి. కాని విడుదల అవ్వక పోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఉపేంద్ర పాత్ర నేపథ్యంలో కన్నడ వర్షన్ విషయమై నిర్ణయం మార్చుకున్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది ఆ గని కే తెలియాలి.


Recent Random Post: