సారాకి అక్కయ్యలా ముస్తాబైన వరుణ్ ధావన్!

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. నటుడిగా..సింగర్ గా..డబ్బింగ్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరోకి మంచి పేరుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. ముఖ్యంగా లవ్ స్టోరీలకు వరుణ్ ని పర్పెక్ట్ గా ఛాయిస్ గా తీసుకుంటారు మేకర్స్. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` తో మొదలైన ప్రయాణం నేటికీ దిగ్విజయంగా సాగిపోతుంది.

ఉమెన్ గెటప్ ల్లో సైతం ఒదిగిపోతాడు. తాజాగా నర్సు ఆహార్యంలో ఉన్న ఓ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అచ్చం నర్సులా తలకి టోపీ..కాళ్లకి..చేతులకి సాక్సులు ధరించాడు. నడుము మక్కలపై రెండు చేతులు వేసుకుని అడాలక్కయ్యలా ఫోజులిచ్చాడు.

వరుణ్ పక్కనే యువ నాయిక సారా అలీఖాన్ నుంచొని జంటగా ఫోజులిచ్చారు. సారా క్యాజువల్ వేర్స్ లో ఉంది. మరి ఈ గెటప్ వరుణ్ ధావన్ ఇప్పుడు ఎందుకు పోషించాడు? అంటే అసలు సంగతుల్లోకి వెళ్లాల్సిందే. ఇది ఇప్పటికి ఫోటో కాదు. రెండేళ్ల క్రితం నాటి ఫోటో మళ్లీ ఇలా ఇన్ స్టాలో వైరల్ గా మారింది.

వరుణ్ ధావన్-సారా అలీఖాన్ జంటగా `కూలీనెంబర్ -1` చిత్రంలో నటించారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమా చక్కని విజయాన్ని సాధించింది. ఇది బాలీవుడ్ లో 1995 లో తెరకెక్కిన లో తెరకెక్కిన `కూలీ నెంబర్ -1` కి రీమేక్. అప్పట్లో ఇందులో గోవిందా-కరిష్మా కపూర్ జంటగా నటించారు. అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది.

ఇదే చిత్రాన్ని మళ్లీ డేవిడ్ ధావన్ వరుణ్ ధావన్ తో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమాలో వరుణ్ ధావన్ నర్సు గెటప్ లో కనిపిస్తాడు. అప్పుడు ఫోటోనే మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈపిక్ పై నెటి జనుల కామెంట్లు ఆసక్తికరం. సోసో హాట్.. యువర్ లుకింగ్ సో సాక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోసారి ఈ జంట కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరికను ఈ జంట మళ్లీ ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.

ఇక వరుణ్ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. `జగ్ జగ్ జీయో`.. బెహ్ ధియా చిత్రాల్లో నటిస్తున్నాడు. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తోన్న జగ్ జగ్ జియో సెట్స్ లో ఉంది. ఇందులో వరుణ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. అలాగే అనీల్ కపూర్..నీతూకపూర్ నటిస్తున్నారు. బెహ్ దియా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఇందులో వరుణ్ కి జంటగా కృతి సనన్ నటిస్తోంది. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సారా అలీఖాన్ ఇటీవలే `ఆంట్రగిరే` చిత్రంతో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.


Recent Random Post: