వల్లభనేని వంశీకి చేదు అనుభవం.. గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కు చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో గ్రామస్థులు ఆయన్ను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే వంశీని గ్రామంలోకి రాకూడదని, వెనక్కు వెళ్లిపోవాలని నినదించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి వంశీ పర్యటనను అడ్డుకున్నారు గ్రామస్థులు.

దీంతో మల్లవల్లి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మొదటి నుంచీ వంశీ విషయంలో గన్నవరంలో వర్గపోరు నడుస్తోంది. మంగళవారం వంశీకి ఎదురైన అనుభవం కూడా ఇంటిపోరే. దీంతో వంశీ వర్గం, వైరి వర్గం నినాదాలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.


Recent Random Post: