సీతారామం – బింబిసార… రిలీజ్ డే నే ఓటీటీ అప్డేట్ వచ్చేసింది


దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక అందమైన ప్రేమ కథ సినిమా ను హను రాఘవపూడి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సినిమా కి రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లా కాకుండా మంచి కంటెంట్ మూవీ అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెద్ద ఎత్తున థియేట్రికల్ రిలీజ్ చేశారు. సినిమాకు వచ్చిన టాక్ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.సినిమా రిలీజ్ అయిన రోజే ఓటీటీ పార్టనర్ గురించి క్లారిటీ ని మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కి అమ్మేసినట్లుగా ప్రకటించారు.

సినిమాలో స్ట్రీమింగ్ పార్టనర్ గా అమెజాన్ ను పేర్కొన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ కు గాను అమెజాన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారా లేదా 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందా అనేది చూడాలి.

సీతారామం సినిమా తో పాటు నేడే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా కూడా ప్రనేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించి నిర్మించాడు. ఈ సినిమా కు వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొనడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

బింబిసార సినిమాకు వచ్చిన హైప్ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ జీ5 భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ ద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా కోసం పలు ఓటీటీ లు పోటీ పడగా చివరకు జీ 5 దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన ఎన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.


Recent Random Post: