అందరి ప్రాజెక్టులను మార్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

టాప్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో విజయం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా స్థానంలో మహేష్ బాబుతో సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా కన్ఫర్మ్ అయినా కూడా పుష్ప సినిమా ఆలస్యం అవుతుండడంతో ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాడు.

దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. కొరటాల శివ, అల్లు అర్జున్ సినిమా వచ్చే సమ్మర్ కు వాయిదా పడింది. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రానికి తగినంత సమయం తీసుకుని షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఉండడంతో తన సినిమాను ఫాస్టప్ చేసాడు. ఇలా త్రివిక్రమ్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల అందరి ప్రాజెక్టుల లైనప్ లు మారిపోయాయి.


Recent Random Post: