పవన్ కోసం నిర్మాతగా మారిన త్రివిక్రమ్

అగ్ర దర్శకుడిగా వెలుగుతోన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంలో క్రియాశీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలను పవన్ ఎంచుకోవడంలో కూడా భూమిక పోషించాడు.

ఇక ప్రస్తుతం పవన్ రీమేక్ కు మరో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సితం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సముద్రఖని దర్శకుడు కాగా భీమ్లా నాయక్ తరహాలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చినట్లు తెలుస్తోంది.

తమిళ్ చిత్రాన్ని పవన్ ఇమేజ్ కు తగిన విధంగా మార్పులు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అటు పవన్ కు ఇటు త్రివిక్రమ్ కు బాగానే ముడుతోందని తెలుస్తోంది.


Recent Random Post: