త్రిషను పెళ్లాడతానని ప్రపోజ్ చేసిన ఛార్మి.. ఇప్పుడు చట్టబద్ధమేనంటూ!!

పంజాబీ బ్యూటీ ఛార్మీతో త్రిష స్నేహం అన్నివేళలా హాట్ టాపిక్. తాజాగా మరోసారి ఆ ఇద్దరి నడుమా ఓ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ గురించి యూత్ చర్చించుకుంటోంది. గడిచిన కాలంలో త్రిష కృష్ణన్ ను వివాహం చేసుకోవాలని ఛార్మి కౌర్ ప్రతిపాదించినప్పుడు ఆ ఇద్దరి నడుమా ట్విట్టర్ సంభాషణ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. స్నేహితురాళ్లు త్రిష కృష్ణన్ – ఛార్మి కౌర్ నేటితరానికి BFF లక్ష్యాలను అందించడానికి తరచుగా సోషల్ మీడియాలో కొన్ని గొప్ప స్నేహబంధానికి సంబంధించిన ఫోటోలను పంచుకోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

త్రిష టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఏల్తున్న రోజుల్లో ఛార్మి కూడా హవా సాగించింది. అప్పట్లోనే ఆ ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. హైదరాబాద్ లో త్రిషకు ఛార్మి బెస్ట్ కంపానియన్. ఆ ఇద్దరూ కలిసి డిన్నర్ పార్టీలకు వెళతారు. అయితే ఇటీవలి కాలంలో ఛార్మి కెరీర్ అనూహ్యంగా జీరో అయ్యింది. తాను పూరితో కలిసి నిర్మాతగా కొనసాగుతున్నారు.

మరోవైపు త్రిష సుదీర్ఘ కెరీర్ లో ఇంకా తన స్టార్ డమ్ ని పొడిగించడంలో విజయవంతం అవుతోంది. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో త్రిష కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చెన్నై చంద్రం కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. కోడి- పరమపధం విలయట్టు- వర్షం- 96 లాంటి బ్లాక్ బస్టర్లలో త్రిష నటించింది.

నిర్మాత చార్మి కౌర్ కి మంచి స్నేహితులు కాబట్టి త్వరలోనే త్రిషతో ఓ సినిమాని ప్లాన్ చేస్తుందనే టాక్ కూడా వినిపించింది. అయినంత మాత్రాన త్రిషను తన పుట్టినరోజున వివాహం కోసం ప్రపోజ్ చేయడం షాకిస్తోంది. నిజానికి ఇది త్రోబ్యాక్ న్యూస్. 2019 లో త్రిషకు చార్మి ప్రపోజ్ చేసింది. ఇప్పటికే మూడేళ్లయ్యింది. “బేబీ ఐ లవ్ యు .. ఎప్పటికీ నా మోకాళ్లపై నిలబడి నా ప్రపోజల్ ని అంగీకరించడానికి వేచి ఉండు. ఇప్పుడు చట్టపరంగా కూడా అనుమతి ఉంది. #హ్యాపీబర్త్ డే @త్రిషా“ అని ఛార్మి అంది. దానికి త్రిష స్పందిస్తూ..“థ్యాంక్యూ .. నేను ఇప్పటికే అవును అని చెప్పాను @ఛార్మి“ అని అంది.

ఈ ఇద్దరి సంభాషణ అభిమానుల్లో ఇప్పుడే ఎందుకు మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది? అంటే.. ఛార్మి గత కొద్దిరోజులుగా మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే త్రిషతో ఛార్మి సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోని కొందరు అంతర్జాలంలో వైరల్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.


Recent Random Post: