ఇంకా పెళ్లికి సిద్దం అవ్వలేదట!

టాలీవుడ్ కోలీవుడ్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ త్రిష ఇంకా కూడా కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈమద్య కాలంలో ఈమె తెలుగు సినిమాలు తగ్గించినా తమిళంలో మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ఉంది. నాలుగు పదుల వయసుకు చేరువ అయిన ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. చెన్నై కు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈమె పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఆమద్య మీడియాలో వార్తలు వచ్చాయి. తమిళ మీడియా గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లి గురించి పదే పదే వార్తలు ప్రసారం చేస్తుంది.

తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ఈమె పెళ్లి గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో స్పందించి తాను పెళ్లికి సిద్దం అవ్వలేదు అంటూ స్పష్టత ఇచ్చింది. తనకు పెళ్లి గురించిన ఆలోచన లేదు అని.. పెళ్లి పై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. పెళ్లి విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని కూడా పేర్కొంది.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈమె పెళ్లికి సిద్దం అయ్యింది. నిశ్చితార్థం కూడా అయిన తర్వాత ఆమె పెళ్లి ని క్యాన్సిల్ చేసుకుంది. పెళ్లి విషయంలో ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నది తెలియదు కాని అప్పటి నుండి పెళ్లి వార్తలు వస్తున్నా కూడా కొట్టి పారేస్తూ వస్తోంది. సినిమా లో ఆఫర్లు వచ్చేంత కాలం చేస్తూనే ఉండాలని.. పెళ్లి విషయంను ఆలోచించవద్దని ఈమె భావిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.


Recent Random Post: