ఆ ఒక్క మాటతో తెలుగు ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేసిన విజయ్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి టాలీవుడ్లోనూ సూపర్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన నటించిన తుపాకీ పోలీసోడు మాస్టర్ వంటి తమిళ చిత్రాలు డబ్బై ఇక్కడ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో తెలుగులో విజయ్ మార్కెట్ భారీగా పెరిగింది. ఈయన తాజా చిత్రం ‘బీస్ట్’ కూడా తెలుగులో రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.

మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం రేపు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీ అనంతరం విజయ్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయనున్నాడు. ‘విజయ్ 66’ వర్కింగ్ టైటిల్తో ఇటీవలె చెన్నైలో గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందించబోతున్నాడు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందిస్తున్నారని విజయ్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడంటూ తెలుగు అభిమానులు సంబరపడిపోయారు.

కానీ తాజాగా విజయ్ వారి ఆశలపై నీళ్లు జల్లాడు. ‘బీస్ట్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. వంశీ పైడిపల్లి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అసలేం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో ‘టాలీవుడ్ లో కూడా మీకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది? అని విజయ్ను ప్రశ్నించారు.

అందుకు ఆయన బదులిస్తూ.. ‘ఇది బై లింగ్యువల్ సినిమా కాదు. నా గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా తెలుగులో డబ్ అవుతుంది’ అని సమాధానం ఇచ్చారు. ఈ ఒక్క మాటతో ‘విజయ్ 66’ కూడా డబ్బింగ్ చిత్రమే అని తేలిపోయింది. దీంతో ఇప్పుడీ విషయం తెలుగు ఫ్యాన్స్ ను బాగా హర్ట్ అయ్యేలా చేస్తుంది.


Recent Random Post: