సుకుమార్‌, రౌడీ స్టార్‌ సినిమా ఏం జరిగింది?

అల్లు అర్జున్‌ తో ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్న సుకుమార్‌ ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ సినిమా ను పూరి జగన్నాద్‌ చేస్తున్నాడు. లైగర్‌ పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ త్వరలోనే సుకుమార్‌ దర్శకత్వంలో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా వాయిదా పడిందా లేదంటే క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం సినిమా వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ వీరి కాంబో సినిమా రావాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ తో సినిమా క్యాన్సిల్‌ అయిన నేపథ్యంలో చరణ్‌ తో సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.


Recent Random Post: