థమన్ ని ఊపిరి కూడా తీసుకోనివ్వని నెటిజనాలు

ఈమద్య సంగీత దర్శకులు ప్రతి ఒక్కరికి కూడా కాపీ క్యాట్ అంటూ ట్యాగ్ ను తగిలించేందుకు కొందరు యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు స్టార్ మ్యూజిక్ కంపోజర్లను కూడా కాపీ క్యాట్ అంటూ ప్రస్థావిస్తూ గతంలో పలు సార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం జరిగింది. వారు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా ప్రేక్షకులు వారి వారి మ్యూజిక్ ను ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో తాజాగా వచ్చిన పాటలు.. అవి అయిన సక్సెస్ తీరు చెప్పకనే చెబుతున్నాయి.

తాజాగా థమన్ కు మరోసారి ఆ చేదు అనుభవం ఎదురైంది. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ రాధేశ్యామ్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందిస్తున్న విషయం తెల్సిందే. అఖండ సినిమా కు ఓ రేంజ్ లో కుమ్మేసిన థమన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లుగా మేకర్స్ నుండి ఆ మద్య అధికారిక ప్రకటన వచ్చింది. పాటలు వేరే సంగీత దర్శకులు ఇచ్చినా సినిమా పై ఉన్నఅంచనాలు మరియు ప్రభాస్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో రాధేశ్యామ్ కు థమన్ బీజేఎం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.

ప్రభాస్ తో ఛాన్స్ అవ్వడంతో పాన్ ఇండియా స్థాయిలో తన ప్రతిభను కనబర్చే అవకాశం ఉంటుంది. అందుకే థమన్ ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు వర్కౌట్లు చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ కు ఏ స్థాయిలో బీజీఎం ను ఇచ్చాడో మనం అంతా చూశాం. కనుక అదే స్థాయిలో రాధేశ్యామ్ సినిమా కు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

రాధేశ్యామ్ సినిమా పక్కా క్లాస్ మూవీ అంటున్నారు. కనుక థమన్ అంతే క్లాస్ గా బీజీఎం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ట్విట్టర్ లో రాధేశ్యామ్ బీజీఎం చిన్న బిట్ ను వదిలాడు. థమన్ ఆ బీజీఎం షేర్ చేసిన వెంటనే ఒక నెటిజన్ ఇది కాపీ అంటూ ఒక డెవోషనల్ సాంగ్ ను కూడా షేర్ చేశాడు. ఈ డెవోషనల్ నుండి మీరు కాపీ చేశారంటూ అతడు ట్రోల్ చేశాడు.

థమన్ ఇలా షేర్ చేశాడో అలా ట్రోల్ చేసేందుకు జనాలు సిద్దం అయ్యారు అంటే కచ్చితంగా వారు థమన్ కి యాంటీ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థమన్ ను మరీ ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా విమర్శలు చేయడం దారుణం అంటున్నారు. మరో వైపు థమన్ షేర్ చేసిన బీజీఎం బిట్ కు ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదే రేంజ్ బీజేఎం కొనసాగించాలని కోరుకుంటున్నారు.


Recent Random Post: