శ్రీకాంత్‌ అడ్డాల గురించి మహేష్‌ వ్యాఖ్యలు వైరల్‌

నారప్ప సినిమాతో మరోసారి శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఆయన పై ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆయన ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా శ్రీకాంత్‌ అడ్డాల గురించి గతంలో మహేష్‌ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రీకాంత్‌ అడ్డాల ఒక సింపుల్‌ పర్సన్‌ అంటూ మహేష్‌ బాబు పేర్కొన్నాడు.

ఇంకా మహేష్‌ బాబు మాట్లాడుతూ.. ఆయన సినిమా షూటింగ్ కు బైక్‌ పై వచ్చేవాడు. ఆయనకు కారు లేదు. చాలా జెన్యూన్‌ పర్సన్‌. ఆయన లాంటి ఒక డైరెక్టర్ ను నేను ఎప్పుడు చూడలేదు. బైక్‌ పై వెళ్తాడు లేదంటే బస్‌ ఎక్కుతాడు. ఆయనది ఒక వింతైన ప్రపంచం. ఇండస్ట్రీలో ఆయనకు ఎక్కువ మంది పరిచయస్తులు కూడా లేరు. నేను ఏదైనా మూడ్‌ లో ఉన్నప్పుడు శ్రీకాంత్‌ కు కాల్‌ చేస్తాను. ఆయనతో కొద్ది సమయం మాట్లాడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటూ గతంలో మహేష్‌ బాబు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Recent Random Post: