జగపతి బాబుకి నాకు ఆ విషయంలో పోలిక లేదు: శ్రీకాంత్

హీరోగా శ్రీకాంత్ కెరీర్ దాదాపుగా డెడ్ ఎండ్ కు వచ్చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో విలన్ గా కూడా మారుదామని చేసిన ప్రయత్నం వికటించింది. అయితే మరోసారి శ్రీకాంత్ విలన్ గా మారాడు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రానున్న అఖండలో శ్రీకాంత్ పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు.

లెజండ్ తో జగపతి బాబు కెరీర్ ను మార్చినట్లే, బోయపాటి అఖండతో శ్రీకాంత్ కెరీర్ ను మారుస్తాడని అంతా అనుకుంటున్నారు. ఈ విషయమే శ్రీకాంత్ ను అడిగితే.. లెజండ్ తో జగపతి బాబు కెరీర్ ఎలా మారిందో చూసాను. ఇప్పటికీ ఆయన మంచి రేంజ్ లో ఉన్నారు. అయితే నా కెరీర్ కూడా అలా మారుతుందంటే ఏమో.. ముందు జనాలు నా పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

అసలు బోయపాటి గారు ఈ చిత్రంలో నా పాత్ర గురించి చెప్పినప్పుడు భయపడ్డాను. ఆ ఇంటెన్సిటీ మ్యాచ్ చేయగలనా అనిపించింది. అయితే బాలయ్యతో ఢీ కొట్టడం బాగుంది అని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


Recent Random Post: