చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ పై సోనూసూద్‌ స్పందన

జాతీయ రియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్‌ గత ఏడాది లాక్ డౌన్ టైమ్ నుండి ఇప్పటి వరకు తన సాయం ను కంటిన్యూ చేస్తున్నాడు. తన చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా వేలాది మందికి ఆక్సీజన్‌ ను అందించడంతో పాటు మందులు ఇంకా కావాల్సిన అవసరాలను తీర్చుతూ వచ్చాడు. పెద్ద ఎత్తున ఆక్సీజన్ సరఫరా చేసి ప్రభుత్వం కంటే సోనూ సూద్ ది బెస్ట్‌ అన్నట్లుగా అంతా అనుకునేలా చేశాడు. అలాంటి సోనూ సూద్ తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి గారి ఆక్సీజన్ బ్యాంక్‌ ఐడియా చాలా అద్బుతం. బ్లడ్‌ బ్యాంక్ మాదిరిగా ఆక్సీజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. ఈ సమయంలో డబ్బులు లేని వారు ఆక్సీజన్ లేక చనిపోతున్నారు. వారి కోసం చిరు ఆక్సీజన్‌ బ్యాంక్‌ చాలా ఉపయోగదాయకం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలు కాపాడిన చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ ముందు ముందు మరింత మందికి సేవలు అందిస్తాయనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.


Recent Random Post: