సోనూసూద్‌ కు ఇక ఆఫర్లు కష్టమే..!

టాలీవుడ్‌ లో విలన్ గా సుదీర్ఘ కాలంగా నటిస్తున్న సోనూసూద్‌ కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ఎందుకంటే ఆయన కరోనా లాక్‌ డౌన్ సమయంలో స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. రియల్‌ హీరోగా పేరు దక్కించుకున్న ఆయన వరుసగా సినిమాలను చేయాలని భావించినా కూడా ప్రస్తుతం ఆయనకు వచ్చిన ఇమేజ్ నేపథ్యంలో విలన్‌ గా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపక పోవచ్చు అంటున్నారు.

హీరోగా సోనూసూద్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఇప్పటి వరకు ఆయన మాత్రం కొత్త సినిమాలకు కమిట్ అయ్యేందుకు సిద్దంగా లేడు. ఒక వైపు విలన్ గా ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న సోనూ సూద్ కు నిరాశ కలుగుతోంది. మరో వైపు హీరోగా ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలనే విషయమై క్లారిటీ లేదు. ఈ కారణం వల్లే సోనూ సూద్‌ కెరీర్ మెల్లగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు.


Recent Random Post: