సోనూసూద్ కు కరోనా నెగటివ్.. ట్విట్టర్లో వెల్లడి

ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా నెగటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ఈ నెల 17న తాను కరోనా పాజిటివ్ కు గురైనట్టు వెల్లడించారు. దీంతో ఆయన స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈరోజు జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగటివ్ వచ్చింది.

గతేడాది కరోనా సమయంలో వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచారు. దీంతో సోనుసూద్ పేరు దేశవ్యాప్తంగా మోగిపోయింది. విద్యార్ధులు, రైతులు, సామాన్యులు.. ఇలా ఎంతోమందికి ఆయన ఇప్పటికీ సాయం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యలో నటిస్తున్నారు.


Recent Random Post: