సైకిల్ పై చిరంజీవి ఆచార్య సెట్స్ కు వెళ్లిన సోనూసూద్

సోనూ సూద్.. దేశ వ్యాప్తంగా ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకి సాయం అందించి, లాక్ డౌన్ టైంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేసి ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. అంతే కాకూండా తనతోటి సినీ కార్మికులకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించాడు.

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఈ మూవీలో సోనుసూద్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం వర్షం పది చల్లగా ఉన్న వాతావరణంలో సోనుసూద్ సైకిల్ మీద ఆచార్య షూటింగ్ లొకేషన్ కు వెళ్లడం విశేషం. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి.


Recent Random Post: