14 ఏళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది

బాలీవుడ్‌ నటి సోమీ అలీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నో మోర్‌ టియర్స్ అనే స్వచ్చంద సంస్థను నడిపిస్తోంది. ఈమె తన స్వచ్చంద సంస్థలో లైంగిక వేదింపులకు గురైన వారు అత్యాచార బాధితులు ఉంటారు. వారి జీవితానికి భద్రత కల్పించడంతో పాటు వారి కోసం సంస్థ పని చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక సందర్బంగా తన పై 14 ఏళ్ల వయసులోనే అత్యాచారం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇన్నేళ్లకు ఈ విషయం చెప్పడం కూడా వివరణ ఇచ్చింది.

చిన్నతనంలోనే నాపై లైంగిక వేదింపులు జరిగాయి. ఆ సమయంలో నా తల్లిదండ్రులతో చెప్పగా వారిని మందలించారు. అలాగే నన్ను కూడా ఎప్పుడు ఇలా బయటకు చెప్పకు అంటూ హెచ్చరించారు. దాంతో నేను ఆలోచనలో పడ్డాను. ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పకూడదు. నేను తప్పు చేయకున్నా ఎందుకు నాదే తప్పు అవుతుందని ఆలోచించాను అంది. ఇక 14 ఏళ్ల వయసులో పాకిస్తాన్ లో మొదటి సారి నాపై అఘాయిత్యం జరిగిందని చెప్పింది. ఇలాంటి స్వచ్చంద సంస్థ నడుపుతున్న నేను ఈ విషయాన్ని చెప్పక పోవడం మోసం అవుతుంది అందుకే ఇన్నాళ్లు ఆ విషయాన్ని చెప్పాను అంది.


Recent Random Post: