సీతాపాపతో మహేష్.. ఆ ఇంట్లో ప్లూటో ఎవరు?


సెకండ్ వేవ్ ప్రభావంతో స్టార్లంతా ఇంటి పట్టునే ఉంటున్న సంగతి తెలిసిందే. షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ వేసి ప్రస్తుతానికి సెలవుల్లో గడుపుతున్నారు. మొదటి వేవ్ సమయంలో ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రెండో వేవ్ వల్లా సెలవుల్లో గడపాల్సొస్తోంది. అయితే కుటుంబంతో గడిపేందుకు ఇదే మంచి సమయం.

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రీకరణను వాయిదా వేసి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆయన ఈ తీరిక సమయాన్ని గౌతమ్ – సితారతోనే ఎక్కువగా గడిపేస్తున్నారని సమాజిక మాధ్యమాల్లో ఫోటోలు చెబుతున్నాయి. ముఖ్యంగా సీతాపాపతో అస్సలు టైమ్ ఎలా గడుస్తున్నది తెలియనే తెలీదు. మహేష్ – సితార జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని తమ ఇంటి హాల్ లో ఉన్నప్పటి ఫోటో ఇది.

అలాగే సితార ఘట్టమనేని తన ఇన్ స్టాలో `ప్లూటో సిట్టింగ్` అంటూ ఓ ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆర్ట్ క్లాస్ సెషన్ నడుస్తోంది. ప్లూటో లీస్ట్ బాదర్డ్..! అంటూ స్మైలీ ఈమోజీని షేర్ చేసింది సితార. దానికి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ రిప్లయ్ ఇచ్చారు. వావ్ వావ్ సితారు.. ప్లూటో నీకు కుడివైపు బుద్ధిగా కూచోవడం చూడటానికి లవ్ లీగా ఉంది!! అంటూ లవ్ ఈమోజీని షేర్ చేసింది. ఇంతకీ ప్లూటో ఎవరు? అంటే అది సీతాపాప ముద్దుగా పెంచుకునే పప్పీ పేరు. సితార ఆన్ లైన్ క్లాసుల్లో బిజగా ఉంటే.. పక్కనే బుద్ధిగా కూచుంది ఈ బ్లాక్ అండ్ వైట్ ప్లూటో.


Recent Random Post: