అతడితో గడపడం నాకు చాలా ఇష్టం

యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్‌ కూతురు శృతి హాసన్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ ఉంటుంది. పాశ్చాత్య సంస్కృతిని బాగా వంటపట్టించుకున్న శృతి హాసన్‌ మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుంది. తాను ఒక స్టార్‌ కూతురు అనే విషయాన్ని ఆమె పట్టించుకోదు. ఆమె చాలా విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క హీరోయిన్‌ మాదిరిగా కాకుండా తనకు సంబంధించిన విషయాలను చాలా నిర్బయంగా బయటకు చెప్పేస్తుంది.

చాలా కాలం పాటు మైకేల్ కోర్సలేతో ఈమె ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. అతడితో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిన శృతిహాసన్‌ ప్రస్తుతం శాంతను హజారికతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది. మైకేల్ తో ఈమె ప్రేమాయణం సాగించడం మొదలుకుని పెళ్లి వరకు వ్యవహారం వచ్చింది. కాని ఇద్దరి మద్య గొడవలు రావడం తో విడిపోయారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న శాంతనుతో ఈమె పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. శాంతనుకు నాకు చాలా అభిరుచులు దగ్గరగా ఉంటాయి. కనుక ఇద్దరం ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తిగా ఉంటాం. అతడితో నాకు ఎక్కువ సమయం గడపడం ఇష్టం అంటూ చెప్పేసింది. పెళ్లి విషయంలో ప్రస్తుతానికి ఆలోచన లేదు అంటూ క్లారిటీగా చెప్పేసింది.


Recent Random Post: