ఎక్సక్లూజివ్‌ః ‘సలార్‌’ కు శృతి హాసన్‌ ఎంత పుచ్చుకుంటుంది

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ల కాంబోలో రూపొందబోతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ ‘సలార్‌’ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్‌ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆమె బర్త్‌ డే సందర్బంగా యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. సలార్‌ పూర్తిగా యాక్షన్‌ మూవీ. కనుక హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండే అవకాశం లేదు. అయినా కూడా సినిమా కోసం క్రేజీ హీరోయిన్‌ ను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌ లో కూడా గుర్తింపు ఉన్న పాన్ ఇండియా అపీల్‌ ఉన్న శృతి హాసన్‌ ను ఎంపిక చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా కోసం శృతి హాసన్‌ రూ.1 కోటి రూపాల పారితోషికంను అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈమద్య కాలంలో శృతి అందుకుంటున్న అతి పెద్ద పారితోషికంగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ బిజీగా ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో షూటింగ్‌ ను జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజే భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్‌ లో శృతి హాసన్‌ ఎప్పుడు జాయిన్‌ అవ్వబోతుంది అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సలార్ సినిమాతో శృతి హాసన్‌ అమాంతం పెరిగి పోవడం ఖాయం అంటున్నారు.


Recent Random Post: