షన్నూకు వచ్చే భార్య కూడా సిరిలా చేయదేమో

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయినప్పటి నుండి కూడా సిరి మరియు షణ్ముఖ్ జష్వంత్ కు సంబంధించిన స్నేహం గురించి టాక్ వినిపిస్తుంది. ఇద్దరు కూడా మరీ ఓవర్ స్నేహంతో ఉంటున్నారు అనేది కొందరి టాక్. మరి ఒకే బెడ్ బ్లాంకెట్ ను షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఒకరి గుండెల మీద ఒకరు పడుకుంటున్నారు అంటూ కొన్ని కొన్ని క్లిప్స్ ను కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇంత స్నేహం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి మద్య ఉన్నది స్నేహమేనా అంటూ జుట్టు పీక్కుంటున్న సమయంలో సిరి వెళ్లి షన్నూకు ముద్దు పెట్టింది. అది కాస్త పెద్ద టాపిక్ అయ్యింది. తాజాగా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లి పోయిన లోబో బిగ్ బాస్ బజ్ లో అరియానాతో పలు విషయాల గురించి మాట్లాడాడు. ఆ సమయంలో షన్నూ మరియు సిరిల స్నేహం గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడాడు.

గతంలో నటరాజ్ మాస్టర్ వీరిద్దరి స్నేహం గురించి మాట్లాడుతూ ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే.. ఇద్దరి స్నేహంకు తప్పులు వెదకాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పుడు లోబో కూడా ఇద్దరు మంచి స్నేహితులు అంటూనే చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు చూడని విషయాలను కూడా లోబో వివరించాడు. ఉదయం లేవగానే బ్రష్ ఇస్తుంది.. అక్కడ నుండి అతడికి కావాల్సిన ప్రతి విషయంలో కూడా సిరి ఉంటుంది. తినిపిస్తుంది.. తాగిపిస్తుంది.. ప్రతి విషయంలో కూడా షన్నూ తోనే సిరి ఉంటుందన్నాడు. షన్నూ కు వచ్చే భార్య అయినా కూడా సిరి చేసినంతగా చేస్తుందో లేదో అంటూ ఆశ్చర్యపోయేలా వ్యాఖ్యలు చేశాడు. షన్నూ కు ఎందుకు సిరి అంతగా చేయాలి అనేది ప్రస్తుతం చర్చనీయాంశం గా మారింది.

ఇక మొదటి వారంలో రవిని ఎందుకు నామినేట్ చేశారు అంటూ ప్రశ్నించగా నాకు ఆ సమయంలో ఎవరు తెలియదు.. అందుకే తెలిసిన వ్యక్తి కదా అని రవిని నామినేట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ లో జెస్సీ స్వార్థ పరుడు అంటూ చెప్పుకొచ్చాడు. సిరి మరియు షన్నూల తో కలిసి ఉండి గేమ్ ను ఆడుతున్నాడు. వారిద్దరితో ఉండటం వల్ల తాను సేవ్ అవుతున్నట్లుగా భావిస్తున్నాడు. సిరి చాలా తెలివిగా గేమ్ ఆడుతోంది. షన్నూ మరియు సిరిలు ఇద్దరు కూడా బిగ్ బాస్ ను చదివేసి వచ్చారు అనిపిస్తుంది అంటూ లోబో పేర్కొన్నాడు. ఇక కాజల్ ను ప్రతి ఒక్కరు కూడా నెగటివ్ గా చూస్తున్నారు. కాని ఆమె లో పాజిటివిటీ చాలా ఉంది. ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని లోబో అన్నాడు. మరో సారి లోబో మాట్లాడుతూ రవిని గురించి చిన్న మాటలకు పెద్ద సమాధానాలు చెప్పడం నచ్చడం లేదని వ్యాఖ్యలు చేశాడు.


Recent Random Post: