టాలీవుడ్ లో ఎన్టీఆర్-సమంతలే టాప్.. తేల్చేసిన తాజా సర్వే!

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతలు టాప్ ప్లేస్ లో నిలిచారు. ఈ విషయం తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా సినీ పరిశ్రమల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంపై ప్రతి సంవత్సరం సర్వే చేస్తుంటుంది.

ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోలు హీరోయిన్లు ఎవరు అన్న విషయంపై సర్వే నిర్వహించి.. టాప్ 10 జాబితాను ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది.

అయితే ఈ సర్వే ప్రకారం.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానాన్ని నేషనల్ స్టార్ ప్రభాస్ దక్కించుకోగా.. మూడు నాలుగు స్థానాల్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ నిలిచారు. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ న్యాచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ మెగాస్టార్ చిరంజీవి రవితేజ వరసగా తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు.

హీరోయిన్ల జాబితాలో సమంత ప్రథమ స్థానాన్ని ఆక్రమించేసింది. సెకెండ్ ప్లేస్ ను కాజల్ అగర్వాల్ సొంతం చేసుకోగా.. అనుష్క శెట్టి పూజా హెగ్డే రష్మిక మందన్నా మూడు నాలుగు ఐదు స్థానాలను దక్కించుకున్నారు. తమన్నా కీర్తి సురేష్ సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ రాశీ ఖన్నాలు ఆ తర్వాతి స్థానాల్లో వరసగా నిలిచారు.

కాగా సమంత ఇటీవలె భర్త నాగచైతన్యతో విడిపోయి తన దారి తాను చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో చాలా మంది సమంతనే తప్పుబట్టారు. కానీ ఎన్ని విమర్శలు ఎదురైనా మరిన్ని సవాళ్లు ఢీ కొట్టినా సమంత వెనక్కి తగ్గలేదు. కెరీర్ పైనే ఫోకస్ పెట్టి జెడ్ స్పీడ్ లో దూసుకుపోతోంది. పైగా చైతుతో విడిపోయిన తర్వాత సమంత ఏం చేసినా ఎక్కడకు వెళ్లినా ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ క్రేజే ఆమెను టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబెట్టిందని అంటున్నారు.

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. `అరవింద సమేత వీర రాఘవ` తర్వాత ఈయన దాదాపు నాలుగేళ్ల పాటు తెరపై కనిపించలేదు. కానీ ఇటీవల విడుదలైన `ఆర్ఆర్ఆర్`తో ఎన్టీఆర్ తన పాపులారిటీని అమాంతం పెంచేసుకుని మోస్ట్ పాపులర్ హీరోల్లో నెంబర్.1గా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.


Recent Random Post: