సమంత సాంగ్ ఇంకా ఊపుతోందిగా..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’ సినిమాలోని ఈ పాట.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో ట్యూన్ కు తగ్గట్టుగా స్టెప్పులు వేసిన సామ్.. అందాల ఆరబోతతో కనువిందు చేసింది.

కొన్నాళ్ల పాటు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఊ అంటావా మావా సందడే కనిపించింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు కనెక్ట్ అయ్యారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ పాటకు ఊగిపోయారు. దీనికి సంబంధించిన రీల్స్ – సరదా పేరడీ సాంగ్స్ నెట్టింట హల్ చల్ చేశాయి.

అయితే సమంత ఐటమ్ సాంగ్ ఊపు ఇంకా తగ్గలేదు. సమ్మర్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో.. ఏ వివాహ వేడుకల్లో చూసినా ‘ఊ అంటావా’ పాట ఊపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ లో సైతం ఓ ఊపు ఊపేస్తోంది.

లేటెస్టుగా ఉత్తరాదిలో ఓ వెడ్డింగ్ లో పెళ్లి కూతురు తండ్రి ‘పుష్ప’ పాటకు డ్యాన్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూటు బూటు వేసుకొని మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. అది కూడా తెలుగు వెర్షన్ ‘ఊ అంటావా’ పాట అవడం గమనార్హం. దీనిని బట్టి సమంత సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

‘పుష్ప’ సినిమాకు పాన్ ఇండియా వైడ్ హైప్ క్రియేట్ అవడానికి ఈ ఐటెమ్ సాంగ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన ఈ పాట కోసం థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ‘ఊ అంటావా’ పాట యూట్యూబ్ టాప్-100 వీడియోస్ గ్లోబల్ లిస్టులో మొదటి స్థానాన్ని దక్కించుకుందని అనుకోవచ్చు.


Recent Random Post: