ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత రోల్ పై ఫుల్ క్లారిటీ

ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ కు ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సిరీస్ కు సీక్వెల్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వస్తోంది. నిజానికి సెకండ్ సీజన్ ఫిబ్రవరిలోనే రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆలస్యమవుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2 మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కాబోతోంది. దీని ట్రైలర్ ను రేపు విడుదల చేస్తారు. ఈ సిరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో కనిపించనుండడం స్పెషల్ హైలైట్.

రాజి అనే తమిళమ్మాయిగా సమంత నటిస్తోంది. ఇందులో ఆమెది సూసైడ్ బాంబర్ రోల్. చాలా పవర్ఫుల్ గా ఉంటుందిట. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసారు.


Recent Random Post: