‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్‌చరణ్‌ని రాముడిలా ఎందుకు చూస్తున్నారు.?

తారకరాముడు అనగానే స్వర్గీయ నందమూరి తారకరామారావు గుర్తుకొస్తారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కూడా తారకరాముడిలానే భావిస్తారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. అనూహ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. తారకరాముడైపోయాడు. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా కనిపించిన సంగతి తెలిసిందే. నిజానికి, చరిత్రలోని సీతారామరాజుకీ చరణ్ పాత్రకీ.. అసలు సంబంధమే వుండదని రాజమౌళి చెబుతూ వచ్చిన మాట వాస్తవం. అలాగే ఎన్టీయార్ పాత్ర కొమరం భీమ్ కూడా.

అయితే, తెలుగునాట ఎన్టీయార్ పాత్రని కొమరం భీమ్‌లా, చరణ్ పాత్రని అల్లూరి సీతారామారాజులా చూస్తున్నారు. చిత్రమేంటంటే, తెలుగేతర భాషల్లో రామ్ చరణ్‌ని రాముడిలా చూస్తున్నారు. ప్రధానంగా బీజేపీ మద్దతుదారులైన సినీ అభిమానులు, రామ్‌చరణ్ పాత్ర రాముడిని పోలి వుందంటూ, ఈ సినిమాకి అదనపు పబ్లిసిటీ ఇస్తుండడం గమనార్హం.

ఈ మధ్యనే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాని బీజేపీ మద్దతుదారులు అక్కున చేర్చుకున్న సంగతి తెలిసిందే. కేవలం బీజేపీ మద్దతుదారుల పుణ్యమా అని, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా అంచనాల్ని మించిన విజయాన్ని అందుకుందన్నది ఓపెన్ సీక్రెట్. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ తెలుగేతర భాషల్లో.. అందునా, నార్త్ ఇండియాలో ఆ బీజేపీ మద్దతుదారుల సపోర్ట్ అనూహ్యంగా లభిస్తుండడం గమనార్హం. అదీ రామ్ చరణ్ పాత్ర రాముడిలా వుందన్న కారణంగానే.

అది అల్లూరి సీతారామరాజుని పోలిన పాత్ర అయితే అయి వుండొచ్చుగానీ, ఉత్తరాది జనాలకి అల్లూరి గురించి తెలియదు గనుక, రాముడి పాత్రగానే వాళ్ళంతా భావిస్తున్నరని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పోటెత్తుతున్నాయి. దీన్ని కొందరు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి, వాళ్ళు జూనియర్ ఎన్టీయార్ అభిమానులే కాదు.. ఆ ముసుగులో వున్న మెగా హేటర్స్.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఎన్టీయార్, రామ్ చరణ్.. ఇద్దరూ అన్నదమ్ముల్లా వున్నారనీ, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు రావాలని ఇద్దరు హీరోల హార్డ్‌కోర్ అభిమానులు కోరుకుంటున్నారనుకోండి.. అది వేరే సంగతి.


Recent Random Post: