దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్ ఆర్ ఆర్ మూడేళ్ళుగా ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. నెల క్రితం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను ఎట్టకేలకు పూర్తి చేసిన రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు.

జనవరి 7 2022న ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల క్యారెక్టర్ వీడియోస్ కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మొదటి పాట దోస్తీను కూడా ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ షురూ కానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ టీజర్ ను ఈ దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.


Recent Random Post: