మాస్ రాజా 25 రోజులకు అంత తీసుకుంటున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య నేటి తరం స్టార్స్ ధీటుగా సినిమాలు చేస్తూ ఆశ్యర్యపరుస్తున్నారు. చాలా వరకు స్టార్స్ ఇంతకు ముందు ఒకటి అర సినిమాలు మాత్రమే చేసేవారు కానీ ట్రెండు మారింది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. క్రేజ్ వున్నప్పుడే ఎన్ని కుదిరితే అన్ని సినిమాల్ని పట్టాలెక్కించాలి అని తమ ఆలోచనని మార్చుకుని వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో వున్న ప్రతీ హీరో చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలున్నాయి. మెగాస్టార్ కూడా ఇందకు భిన్నంగా ఏమీ ఆలోచించడం లేదు. యంగ్ బ్యాచ్ కి ధీటుగా సినిమాలని లైన్ లో పెట్టారు.

అంతే కాకుండా తన సినిమాల్లో యంగ్ స్టార్ లకి ఆవకాశాలిస్తున్నారు. కీలక పాత్రల కోసం ఏకంగా స్టార్ హీరోలనే ఆయన రంగంలోకి దించేస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రంలో తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న మెగాస్టార్ ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’లో యంగ్ హీరో సత్యదేవ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లతో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇదే తరహాలో బాబి డైరెక్ట్ చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం కూడా మరో స్టార్ హీరోని రంగంలోకి దింపేశారు.

ఈ చిత్రంలోని కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాత్ర కు రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మింస్తున్న ఈ చిత్రానికి రవితేజ భారీగానే డిమాండ్ చేశారట. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం రవితేజకు మేకర్స్ 10 కోట్లు పారితోషికం ఇస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ ఒక్కో చిత్రానికి ప్రస్తుతం 17 నుంచి 18 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.

అందుకే మెగాస్టార్ చిత్రంలోని అతిథి పాత్ర కోసం రవితేజ ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేశారని పాత్ర డిమాండ్ ని బట్టి మేకర్స్ రవితేజ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ రేంజ్ లో రవితేజ పారితోషికం డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం షూటింగ్ కి 20 నుంచి 25 రోజులు కేటాయించడమేనని ఆ స్థాయిలో డేట్స్ ఇవ్వడం వల్లే రవితేజ 10 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది.

కేవలం అతిథి పాత్రకే రవితేజ 10 కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ నటిస్తున్న 154వ చిత్రమిది. ఇందులో చిరుకు జోడీగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే మేకర్స్ ఈ విషయాన్ని అథికారికంగా ప్రకటించి షాకిచ్చారు. వైజాగ్ షిప్ హార్బర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అంగర్ కవర్ కాప్ గా షాకింగ్ క్యారెక్టర్ లో కనిపించిన ఆకట్టుకోబోతున్నారట.


Recent Random Post: