మాస్ మహారాజా పవర్ ప్యాక్డ్ డబుల్ ధమాకా

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు. ఇటీవలే `ఖిలాడీ` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఈ మూవీ తరువాత మిగతా చిత్రాల షూటింగ్లతో బిజీ అయిపోయారు రవితేజ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ధమాకా`. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. డబుల్ ఇంపాక్ట్ అని ట్యాగ్ లైన్.

నానితో `నేను లోకల్` రాజ్ తరుణ్ తో `సినిమా చూపిస్తమావ` వంటి హిట్ చిత్రాల్ని అందించిన త్రినాథరావు నక్కిన తొలి సారి రవితేజ తో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆసక్తికరమైన కథ కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `పెళ్లిసందD` ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పవర్ ప్యాక్ట్ యాక్షన్ కు సంబంధింయిన తాజా షెడ్యూల్ ని శుక్రవారం హైదరాబాద్ లో చిత్ర బృందం మొదలు పెట్టింది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో క్రేజీ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ల నేతృత్వంలో రవితేజ కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా పవర్ ప్యాక్డ్ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కీలకంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ నిలుస్తుందని తెలుస్తోంది. తాజా షూటింగ్ గురించి నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రవితేజ కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది సినిమాలో కీలకంగా నిలుస్తుంది. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ని నిర్మించాం` అన్నారు.

అంతే కాకుండా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని కథ డిమాండ్ మేరకు భారీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ధమాకా యాక్షన్ మూవీ లవర్స్ కి ఓ ఫీస్ట్ లా వుండబోతోందని స్పష్టం చేశారు. అంతే ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్ ధమాకాని అందించబోతున్నారన్నమాట. త్రినాథరావు నక్కిన చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత వుంటుంది. అయితే ఈ సారి మాస్ రాజా రవితేజ కోసం యాక్షన్ ని కూడా మిక్స్ చేసి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఎంటర్ టైన్ చేస్తూనే మాస్ మసాలా యాక్షన్ అంశాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ – శ్రీలీల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. అంతే కాకుండా పెయిర్ బాగుందని నెట్టింట కామెంట్ లు కూడా వినిపించాయి. దీంతో ఈ మూవీ ఓ రేంజ్ లో వుంటుందని ప్రచారం మొదలైంది. ఎంటర్ టైన్ మెంట్ కి యాక్షన్ ని జోడించి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విలన్ గా `క్రాక్` ఫేమ్ చిరాగ్ జాని నటిస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్- భీమ్స్ సిసిరోలియో సంగీతం – కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందిస్తున్నారు.


Recent Random Post: