రావణాసుర ఆట మొదలుపెట్టిన మాస్ మహారాజా

`క్రాక్` బ్లాక్ బస్టర్ హిట్ తో మాస్ మహారాజా రవితేజ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని పట్టాలెక్కిస్తూ వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే ఆరు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రవితేజ అందులో రెండు చిత్రాలని ఇప్పటికే రిలీజ్ కి రెడీ చేసేశారు. రమేష్ వర్మతో చేస్తున్న `ఖిలాడీ` శరత్ మండవ డైరెక్షన్లో చేస్తున్న `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. దీంతో సెట్స్ పైకి రావాల్సిన సినిమాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా `రావణాసుర`ని సెట్స్ పైకి తీసుకొచ్చారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. యునిక్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా సుధీర్ వర్మ.. హీరో రవితేజ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఆర్ టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా ఈమూవీని నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాలని సుశాంత్ తో పాటు మరి కొంత మంది ఆర్టిస్ట్ లు పాల్గొనగా చిత్రీకరిస్తున్నారు.

అయితే ఇంత వరకు ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనని హీరో రవితేజ తాజాగా ఈ బుధవారం ఫిబ్రవరి 2 నుంచి సెట్ లోకి ప్రవేశించారు. తొలి రోజు సెట్ లో హల్ చల్ చేసిన మాస్ మహారాజా చాలా ఎక్సైటెడ్ గా వుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సెట్ లోకి ఎంటరైన ఓ సెల్పీ ఫొటోని షేర్ చేసిన రవితేజ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్ ని జోడించారు. `తొలిరోజు `రావణాసుర` సూపర్ ఎక్సైటెడ్గా అనిపించిందని పోస్ట్ చేశారు.

రవితేజ షేర్ చేసిన సెల్ఫీ ఫోటోలో రవితేజతో పాటు `చిట్టి` ఫరియా అబ్దుల్లా దర్శకుడు సుధీర్ వర్మ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా రచయిత శ్రీకాంత్ విస్సా అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వున్నారు. సరికొత్త నేపథ్యంలో విభిన్నమైన కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రవితేజ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ హీరో సుశాంత్ కీలకమైన రామ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకోవర్కు సంబంధించిన పోస్టర్ ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో సుశాంత్ పాత్ర ఇందులో ప్రత్యేకంగా వుండబోతోందని స్పష్టమైంది.

ఈ చిత్రంలో రవితేజతో ఐదుగురు హీరోయిన్ లు రొమాన్స్ చేయబోతున్నారు. అను ఇమ్మానుయేల్ మేఘా ఆకాష్ ఫరియా అబ్దుల్లా దక్షా నాగర్కర్ పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఈ ఐదుగురు హీరోయిన్ లకు చిత్రంలో సమాన ప్రాధాన్యత వుంటుందని తెలిసింది. పది రకాల విభిన్నమైన గెటప్ లలో రవితేజ కనిపించనున్న ఈ చిత్రంలో లేడీ విలన్ గా దక్షా నాగర్కర్ కనిపించబోతోంది.

శ్రీకాంత్ విస్సా అందించిన పవర్ ఫుల్ స్టోరీని అంతే పవర్ ఫుల్ గా తెరపైకి తీసుకురాబోతున్నారు సుధీర్ వర్మ. రవితేజ మేకోవర్ కూడా చాలా కొత్తగా పవర్ ఫుల్ గా వుంటుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా..` అర్జున్ రెడ్డి` ఫేమ్ హర్షవర్ణన్ రామేశ్వర్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.


Recent Random Post: