ఖిలాడీ సాంగ్ షూట్ ను మొదలుపెట్టిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ప్రారంభంలో ఖిలాడీ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను కొట్టిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని చేసాడు. అయితే కొన్ని పోర్షన్స్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. కానీ ఈలోగా రవితేజ తన తర్వాతి చిత్ర షూటింగ్స్ తో బిజీ అయిపోయాడు. శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ ను పూర్తి చేసేసాడు.

మళ్ళీ ఇన్ని నెలల తర్వాత ఖిలాడీ షూటింగ్ కు పచ్చ జెండా ఊపాడు. ఈ చిత్ర సాంగ్ షూట్ ఈరోజు నుండి మొదలవుతుంది. రవితేజ, మీనాక్షి చౌదరిల మీద ఈ సాంగ్ ను అన్నపూర్ణ 7 ఎకరాలలో షూట్ చేయనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. దీని తర్వాత కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది.

ఫిబ్రవరి 11, 2022 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Recent Random Post: