కన్నీరు పెట్టుకుని విజ్ఞప్తి చేస్తున్న నటి

మలయాళ నటి రమ్యా సురేష్ సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో ఫేక్ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలా ఉన్న మహిళ లేదా వేరే మహిళకు తన ఫేస్ ను మార్ఫింగ్ చేసి మరీ బ్యాడ్‌ వీడియోలను షేర్‌ చేస్తున్నారంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. నెట్టింట తన పేరుతో వైరల్‌ అవుతున్న వీడియోలను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సమయంలో తన భర్త తనకు అండగా నిలిచాడు. ఆయన మద్దతుతో ఈ విపత్కర పరిస్థితి నుండి బయట పడుతాను అనే నమ్మకంను వ్యక్తం చేసింది. తన పేరును చెడగొట్టేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. నెట్టింట మళ్లీ ఆ వీడియోను షేర్‌ చేస్తే కఠినంగా వ్యవహరిస్తానంటూ హెచ్చరించాడు. ఈ సమయంలో ఆ వీడియో విషయమై రమ్య సురేష్‌ కన్నీరు పెట్టుకుంది. ఆ వీడియోలను డిలీట్ చేయాల్సిందిగా ఆమె పేర్కొంది.


Recent Random Post: