ఈ ఒక్క రాత్రి ఆగండి.. వర్మ వింత ట్వీట్స్

తనకు సంబంధం ఉన్నా లేకున్నా ట్రెండింగ్ టాపిక్స్ పై స్పందిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ నేడు వాలెంటైన్స్ డే సందర్బంగా వరుస ట్వీట్స్ తో హోరెత్తించాడు.

ఇటీవలే సమ్మక్క సారలమ్మ పండుగ సందర్బంగా మందు బాటిల్ ను దేవతలకు చూపించి వివాదం అయిన ఈ దర్శకుడు వాలెంటైన్స్ డే సందర్బంగా చేసిన ట్వీట్స్ మరింత వైరల్ అయ్యాయి. వాలెంటైన్స్ డే ను తిట్టి పోయడం మాత్రమే కాకుండా విమర్శలు చేశాడు.

ఈ రోజు నేను హ్యాపీ వాలెంటైన్స్ డే అని నేను చెప్పను. ప్రేమికులను కలిపి ఉంచడంలో వాలెంటైన్ విఫలం అయ్యాడు. ప్రతి రోజు ఎన్నో బ్రేకప్ లు అవుతున్నాయి. వాటన్నింటిని కూడా ఆపడంలో వాలెంటైన్ ఫెయిల్ అయినప్పుడు హ్యాపీ వాలెంటైన్ అని ఎలా చెబుతాను అన్నాడు.

బ్రేకప్ కు సిద్దంగా ఉన్న వారు ఎవరైనా ఈ రాత్రి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే వాలెంటైన్ డే అంటూ మీ పార్టనర్ ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ తో వస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత మీరు బ్రేకప్ చెప్పొచ్చు.

ప్రేమలో పడ్డప్పుడు మెదడు పని చేయడం ఆగి పోతుంది. కనుక ప్రేమలో ఉన్న వారు అంతా కూడా వెదవలు అవుతారు. ప్రేమికులు అంతా కూడా తెలివి తక్కువ పనులు చేస్తారు.

అందుకే నిన్ను నీవు ప్రేమించుకో.. అంతే కాని రెండవ వ్యక్తిని ప్రేమించడం ఎందుకు అంటూ వర్మ ప్రశ్నిస్తున్నాడు. ఇక మొదటి చూపులోనే ప్రేమ కలగడం పై కూడా వర్మ స్పందించాడు. మొదటి సారి చూసిన వెంటనే ప్రేమలో పడటం కంటే రెండు మూడు సార్లు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిదన్నాడు.

ప్రేమ అనేది ఎవరి నుండి ఎక్కువ దక్కితే వారి వైపు ఆకర్షితులు అయ్యే అవకాశాలు ఉంటాయి. నీ కంటే ఎక్కువగా ప్రేమించే వారు అవతలి వారికి తారసపడితే ఖచ్చితంగా మీ ప్రేమను వదిలేస్తారు.

ఎప్పటి వరకు అయితే వారికి మీ కంటే ఎక్కువ ప్రేమను ఇచ్చే వారు తారస పడరో అప్పటి వరకు మిమ్ములను ప్రేమిస్తూనే ఉంటారు. రక్త ప్రసరణ వల్లే గుండె పని చేస్తుంది. అంతే తప్ప ప్రేమ అనే పనికి మాలిన పదం వల్ల ఖచ్చితంగా గుండె పని చేయడం లేదని వర్మ ట్వీట్ చేశాడు.

ఒక అబ్బాయి నా హృదయపూర్వంగా ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా అమ్మాయిలు ఆ మాటలు నమ్మవద్దు. ఎందుకంటే ఆ అబ్బాయి మనసుతో కాకుండా ఏదో ఒక అవయవంతో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లనే.

అందుకే అలాంటి అబ్బాయిలను నమ్మవద్దంటూ వర్మ అమ్మాయిలకు సూచించాడు. మొత్తానికి వర్మ ఈ వాలెంటైన్స్ డే సందర్బంగా తన అభిమానులకు మరియు తన ఫాలోవర్స్ కు చాలా ముచ్చట్లు ముఖ్యంగా పాఠాలు చెప్పాడు అనుకోవచ్చు.

తెలివైన వారు ఒక్కసారి ప్రేమలో పడకుండా తమకు నచ్చిన వారిని గుర్తించి ప్రతి సారి ప్రేమలో పడుతూ ఉంటారు. అందుకే వాలెంటైన్స్ డేను నమ్మవద్దు. నేను కూడా నమ్మను అన్నాడు.

వర్మ నుండి రాబోతున్న కొండ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను గత కొన్ని రోజులుగా వర్మ తనదైన శైలిలో చేస్తున్నాడు. వాలెంటైన్స్ డే అంటే నమ్మకం లేదు అంటూనే ఆ సినిమా నుండి ఒక పాటను విడుదల చేశాడు. ఈ సినిమా గురించి వర్మ తెగ హడావుడి చేస్తున్నాడు. త్వరలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.


Recent Random Post: