మరోసారి బాలీవుడ్ భామతో సినిమా చేయనున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత మేర బ్యాలెన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. వీరిద్దరి పెయిర్ బిగ్ స్క్రీన్ మీద చూడముచ్చటగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. కాస్టింగ్ ఎంపిక జరగాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా మళ్ళీ అలియా భట్ నే కన్సిడర్ చేస్తున్నారట. అలియా భట్ అయితేనే బాగుంటుందని అటు చరణ్, ఇటు శంకర్ కూడా భావిస్తున్నారట.


Recent Random Post: