బాబాయ్ వైద్యాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న అబ్బాయ్ చరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెల్సిందే. తన శంకరపల్లి ఫామ్ హౌస్ లోనే పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక ప్రత్యేక అపోలో వైద్య బృందం పవన్ కళ్యాణ్ కు వైద్యం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిందని తెలియగానే రామ్ చరణ్ వెంటనే శంకరపల్లి గెస్ట్ హౌస్ కు వెళ్ళాడు. అక్కడ స్వయంగా పవన్ కు వీలుగా ఏర్పాటు చేసి వైద్య బృందంతో కూడా పరిస్థితిపై చర్చించి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ఆచార్య షూటింగ్ కు కూడా బ్రేకులు వేసాడు రామ్ చరణ్. అసలైతే పూజ హెగ్డే కాంబినేషన్ లో చరణ్ ఆచార్య కోసం సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆచార్యలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్.


Recent Random Post: