జక్కన్న వేసిన మార్గంలో ఇండియన్ సినిమా జర్నీ

ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మంది ట్రెండ్ ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తూ ఉంటారు. ట్రెండ్ కు తగ్గట్లుగా సినిమాలు చేయడంతో సక్సెస్ లు కూడా దక్కించుకుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ట్రెండ్ ను సెట్ చేసే విధంగా సినిమాలను తీయాలి అనుకుంటారు.. చేయాలనుకుంటారు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు.

ఆ ట్రెండ్ ను అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియన్ సినీ వర్గాల వారు ఫాలో అవుతూనే ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు విభిన్న తరహా అలవాటు చేసిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత తాను సెట్ చేసిన ట్రెండ్ లోనే కొనసాగి సినిమాలు చేయడం జరిగింది. ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు… స్టార్ దర్శకులు కూడా శివ సినిమా సెట్ చేసిన ట్రెండు ను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.

రాంగోపాల్ వర్మ మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖ దర్శకులు కూడా సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కి నాంది పలికారు. ట్రెండ్ సెట్ చేయడం లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జక్కన్న రాజమౌళి ముందు ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన తెరకెక్కించిన ప్రతి ఒక్క సినిమా కూడా ట్రెండ్ సెట్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేనే లేదంటూ ఆయన అభిమానులు మాత్రమే కాకుండా సినీ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.

అంతటి గొప్ప దర్శకుడు బాహుబలి సినిమా తో పౌరాణిక సినిమాలకు మళ్లీ ట్రెండ్ సెట్ చేశాడు. భారీ బడ్జెట్ తో పౌరాణిక సినిమాలను ఇప్పుడు తీసినా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయని బాహుబలి 2 తో నిరూపించాడు. ఒక సినిమా భారీ బడ్జెట్ తో రూపొందితే ఆ సినిమా ను రెండు పార్ట్ లుగా విడదీసి విడుదల చేస్తే లాభం ఉంటుందని కూడా బాహుబలితో నిరూపించాడు.

బాహుబలి 2 పార్ట్ ల ఫార్ములను ఎంతో మంది సినీ ప్రముఖులు పాటించారు. ఇక పౌరాణిక సినిమాలకు సంబంధించిన విషయానికి వస్తే బాహుబలి తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు పౌరాణిక సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి.. తర్వలో మరికొన్ని రాబోతున్నాయి. కొన్ని చర్చల దశలో ఉన్నాయి.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళం లో కూడా బాహుబలి తరహా సినిమాలు రాబోతున్నాయి.

మంచి కంటెంట్ తో సినిమా లను తీస్తే ఎన్ని వందల కోట్లు పెట్టినా కూడా సినిమా వసూళ్లను రాబట్టగలదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నుండి బ్రహ్మాస్త్ర మరియు పృథ్వీరాజ్ సినిమా లు బాహుబలి రేంజ్ అంటున్నారు. ఆదిపురుష్ కూడా అంతకు మించిన భారీ చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఇక తమిళంలో రూపొందుతున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ కూడా భారీ బాహుబలి సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జక్కన్న వేసిన భారీ బడ్జెట్ మరియు పౌరాణికం దారిలో ఇండియన్ సినిమా జర్నీని కొనసాగిస్తోంది.


Recent Random Post: