వేరే లెవెల్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసిన జక్కన్న

ఎస్ ఎస్ రాజమౌళి తన నెక్స్ట్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. బాహుబలి తర్వాత మరోసారి భారీ గ్యాప్ తీసుకున్న జక్కన్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ భారీ లెవెల్లో విడుదల అవుతోంది. ఇందుకోసం ఇప్పుడు ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో మొదలవ్వబోతున్నాయి. ఆగస్ట్ 1న ఈ చిత్రంలోని మొదటి పాట దోస్తీను విడుదల చేస్తున్నారు. ఇక రాజమౌళి ప్రమోషనల్ ప్లానింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.

తన సినిమాలకు హైప్ తీసుకురావడం ఎలానో జక్కన్నకు చాలా బాగా తెలుసు. అందుకే ఆర్ ఆర్ ఆర్ కు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ ను ప్లాన్ చేసాడు. హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసాడు రాజమౌళి. వీటి వివరాలు త్వరలో తెలుస్తాయి.


Recent Random Post: